Allu Arjun | అందానికి అందం, అదిరిపోయే టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల యాంకర్ స్రవంతి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి… వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ కూడా స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది అని చెప్పాలి. ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు బన్నీ ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని ఆయన చెప్పడంతో తెగ ఫేమస్ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది తి.ఇక యాంకర్‌గా పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకున్న స్రవంతి .. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. ఈ షోతో కూడా స్రవంతి క్రేజ్ కొంత పెరిగింది. ఇక ఈ అమ్మడు ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని రెండు కుటుంబాలు అంగీకరించకపోయిన ఎన్నో కష్టాలు పడి తిరిగి పెద్దల చెంతకు చేరుకున్నారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గత రాత్రి జరిగిన గద్ధర్ అవార్డ్స్ వేడుకకి హాజరైంది.
ఆ సమయంలో అల్లు అర్జున్ ..యాంకర్ స్రవంతితో మాట్లాడుతూ.. చీర చాలా బాగుంది, బాగుంది, అందంగా ఉన్నారని చెప్పారు. అల్లు అర్జున్ అలా అభినందించడంతో యాంకర్ స్రవంతి ఉబ్బితబ్బిబయిపోతుంది. వెంటనే అల్లు అర్జున్ తో మాట్లాడిన వీడియోని యాంకర్ స్రవంతి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మనం ఎంతగానో ఇష్టపడే హీరో మనం కట్టుకున్న చీర చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా అంటూ రాసుకొచ్చింది. దీంతో స్రవంతి పోస్ట్ వైరల్ గా మారింది. కాగా, జూన్ 14 రాత్రి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.