Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “స్టైలిష్ స్టార్” అనే ట్యాగ్‌తో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు “ఐకాన్ స్టార్” స్థాయికి చేరినా… స్టైల్ విషయంలో మాత్రం బన్నీ నెక్ట్స్ లెవల్ అన్నట్టు ఉంటారు. టాలీవుడ్లో రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోలు ఉన్నా, ఆఫ్-స్క్రీన్ స్టైలింగ్‌ను అల్లు అర్జున్‌లా పూర్తిగా ఫాలో అయ్యే స్టార్ చాలా అరుదు. తెర మీద ఎంత క్లాస్‌గా, ఎంత ట్రెండీగా కనిపిస్తాడో… తెర వెనుక కూడా అదే లెవెల్లో స్టైలిష్‌గా ఉండటం ఆయన ప్రత్యేకతే.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్-ఎమోషన్ కలయికలో అట్లీ ఎప్పుడూ రాజీపడడు. ముఖ్యంగా హీరో స్టైలింగ్ విషయంలో ఓ సరికొత్త లుక్‌ని డిజైన్ చేయడంలో ఈ దర్శకుడికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం విదేశీ స్టూడియోల్లోనే పలు టెస్ట్ షూట్స్ నిర్వహించి, అనేక డిజైనర్లు కలిసి బన్నీ లుక్‌ని ఫైనల్ చేసినట్టు సమాచారం. తాజాగా అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో కనిపించిన పిక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఆ లుక్‌లో ఆయన గతంతో పోల్చితే మరింత స్లిమ్‌గా, గ్రే హెయిర్ స్టైల్‌తో, నెక్‌పై డిజైనర్ చైన్లతో కనిపించారు. ఈ స్టైల్ మొత్తం అట్లీ టచ్ స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
అట్లీ ఆడియన్స్ ముందుకి రాకపోయిన తెర వెనుక నిజమైన స్టైలిష్ స్టార్. డిజైనర్ దుస్తులు, మోడర్న్ యాక్సెసరీస్‌తో ఎప్పుడూ ఫ్యాషన్‌కి దగ్గరగా ఉండే ఆయన, బన్నీ న్యూ లుక్‌లో కూడా తన టేస్ట్‌ని చూపించాడు. అందుకే ఇప్పుడు అభిమానుల్లో ఈ లుక్‌పై ఆసక్తి పెరిగింది. అట్లీ-బన్నీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే కుతూహలం భారీగా పెరిగింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టైలింగ్‌కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ అవుతుందనే ఇంట్రస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.