Allu Arjun- Neel | పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన తరువాత, అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులు పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఫాంటసీ మూవీ చేయాల్సి ఉండగా, అది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్లింది. ఇక సందీప్ రెడ్డి వంగాతో బన్నీ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. కట్ చేస్తే తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు బన్నీతో “రావణం” అనే ప్యాన్-వరల్డ్ మూవీ గురించి చూచాయిగా చెప్పడంతో ఈ ప్రాజెక్టు పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే, ఈ నిర్మాణానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ “డ్రాగన్” సినిమాని 2026 సమ్మర్ వరకు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సలార్ 2’ తీస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘రావణం’ సెట్స్ మీదికి వెళ్తుంది’ అని తాజాగా చెప్పుకొచ్చారు దిల్ రాజు. అంటే దాదాపు 2028లోనే ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. దీని నిర్మాణం ఒక సంవత్సరం పైగా పడుతుంది. దిల్ రాజు గతంలో కూడా ప్రశాంత్ నీల్ తో జతకట్టే విషయం గురించి మాట్లాడినప్పటికీ, హీరో గురించి స్పష్టత ఇవ్వలేదు. కాని చూస్తుంటే 2028లో బన్నీ- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది
మైథాలజీ టచ్ తో ఈ సినిమా ఉంటుందని అంతర్గత సమాచారం ప్రకారం.చూడాలి మరి రానున్న రోజులలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇంకెన్ని వార్తలు వస్తాయి అనేది. ఇక దిల్ రాజు నిర్మాతగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన రానున్న రోజులలో విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేయనున్నాడు. అలానే నితిన్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సారి పక్కా ప్లానింగ్‌తో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.