Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ‘పుష్ప 2’ తర్వాత నెక్స్ట్ లెవల్‌కు చేరింది. ఈ సినిమా ఘనవిజయంతో ఆయన నేషనల్ స్టార్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదిగారని చెప్పాలి. స్టైల్, మాస్ ఇమేజ్, పాన్ ఇండియా క్రేజ్‌తో పాటు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేకర్స్ ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్. ఇదిలా ఉంటే, సినిమాలతో పాటు అల్లు అర్జున్ ఇప్పుడు బిజినెస్ రంగంలోకి కూడా భారీగా అడుగుపెట్టాడు. ‘అల్లు సినిమాస్ (Allu Cinemas)’ పేరుతో ఓ గ్రాండ్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో ఈ భారీ థియేటర్ నిర్మాణం జరుగుతోంది. విశేషమేంటంటే… ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ అవడం. ఈ మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
75 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, పవర్ఫుల్ సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ఇలా ప్రతి అంశాన్ని టాప్ లెవల్లో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ భారీ థియేటర్ ఓపెనింగ్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నాడు. త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశముందని సమాచారం. మొత్తానికి, అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాల్లోనూ, బిజినెస్‌లోనూ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తూ ఐకాన్ స్టార్‌కు తగ్గ రేంజ్‌ను మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు.