Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఓ వైపు సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే.. మరోవైపు థియేటర్ బిజినెస్‌లోకి కూడా ఎంటరైన విషయం తెలిసిందే. అత్యాధునిక లగ్జరీ సౌకర్యాలతో హైదరాబాద్‌లో ఏసియన్ మల్టీప్లెక్స్ (AAA Cinemas) థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ థియేటర్లో ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ (Full LED projection screen) సౌకర్యం ఈ థియేటర్లో అందుబాటులో ఉండనుంది. సౌతిండియాలోనే ఫుల్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ సౌకర్యమున్న రెండో థియేటర్‌గా నిలువనుంది. స్టాండర్డ్ సినిమా ప్రొజెక్టర్స్‌కు బదులు ఇమేజ్ను ప్రొజెక్ట్ చేసేందుకు పూర్తిస్థాయిలో ఎల్ఈడీ స్క్రీన్‌ను వినియోగించనున్నారు. ఈ థియేటర్లో విభిన్న రంగుల వేరియేషన్స్ తో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్‌తో సినిమా చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది. హైదరాబాద్‌లో ఇలాంటి సౌకర్యం కలిగిన మొదటి థియేటర్ ఇదే కావడం విశేషం. ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది బన్నీ టీం.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప.. ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.