Allu Arjun – Neel | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కూడా కలిపినట్లు దిల్ రాజు ప్రకటించాడు. ‘రవణం'(Ravanam) అంటూ ఈ సినిమా రాబోతుందని ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఈ సినిమా ఉండబోతుందని హింట్ కూడా ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కథానాయకుడిగా మొదట ప్రభాస్ అనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ పోవడంతో అతడి డేట్స్ ఖాళీగా లేకపోవడం వలన ఇది వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి మరో స్టార్ వచ్చినట్లు తెలుస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రం దిల్‌రాజు బ్యానర్లో ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ (NTRNeel) సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఇది 2026 జనవరిలో విడుదల కానుంది. ఆ తర్వాత ‘సలార్ 2’ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. అటు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు (AA22). ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబో సెట్స్ మీదకి రానుంది.