Allu Arjun | స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారి నేషనల్ అవార్డ్ విన్నర్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత హైప్ ఉన్న నటులలో ఒకరుగా నిలిచాడు. ప్రతి సినిమాలో తన స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. పుష్ప: ది రైజ్ తర్వాత దేశవ్యాప్తంగా బన్నీ పేరు మార్మోగిపోతోంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తే నిజంగా ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అట్లీ మాస్ కమర్షియల్ టచ్, బన్నీ ఎనర్జీ కలిస్తే అది దేశవ్యాప్తంగా హవా చేసే సినిమా అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ జట్టు కట్టబోతున్నాడని సమాచారం. రవణం అనే టైటిల్‌తో దిల్ రాజు మధ్యవర్తిత్వంలో ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ స్టేజ్‌లో ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ కాంబినేషన్ వస్తే అది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ‘పుష్ప’ రేంజ్లో యాక్షన్, రాజమౌళి మేకింగ్ కలిస్తే అది ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు సెట్ చేసే మూవీ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
బాలీవుడ్ మాస్టర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీతో కూడా బన్నీ స్క్రిప్ట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పుష్ప తర్వాత వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని, భన్సాలీ స్టైల్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే అవార్డ్ రేంజ్ మూవీ అవుతుందని టాక్. ఇక మాస్ ఆడియన్స్‌ను ఉద్దేశించి బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు 2 రూపుదిద్దుకునే అవకాశముంది. బోయపాటి ఇప్పటికే బేసిక్ ఐడియా రెడీ చేసుకున్నారని, బన్నీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. అలాగే కొరటాల శివ కూడా బన్నీ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటనలు వెలువడకపోయినా, అల్లు అర్జున్ ఈ లైనప్‌ను ఫైనల్ చేస్తే ఆయన స్థాయి పాన్ ఇండియా మాత్రమే కాదు , గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.