Allu Arjun | పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు తన కెరీర్‌ని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, పుష్ప 2: ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ములేపేసాడు. గంధపు చెక్కల స్మగ్లర్ “పుష్పరాజ్” పాత్రకు అతనికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం ఆయన క్రేజ్‌ను మరింత పెంచింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో తన మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు మాస్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు. ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే యూనిక్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాజాగా అల్లు అర్జున్ అమెరికాలోని ఫ్లోరిడా, టాంపా నగరానికి చేరుకొని, అక్కడ జరిగే NATS (North America Telugu Society) 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయనకు నాట్స్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ముందు అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం ఉండటం, అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొంటారు. అయితే అల్లు అర్జున్‌కి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా విశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు NATS లాంటి ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షంగా అభిమానులను కలవడం వల్ల ఆయన భవిష్యత్ చిత్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంటుంది.
షారుఖ్ ఖాన్‌తో జవాన్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ..అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా మారుతుందని చెప్పుకొస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా బన్నీ కెరీర్లోనే తొలిసారి మాస్ మేనరిజంతో పాటు టెక్నికల్ ట్రీట్ కూడా ఇస్తుందని విశ్వసిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుంది.