Allu Arjun In Politics | ‘పుష్ప2: ది రూల్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి అంటూ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వచ్చిన వార్తలపై మేము క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాం. ఈ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేయకండి. మేము ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియా సంస్థలతో పాటు ప్రజలను కోరుతున్నాం. అల్లు అర్జున్‌కు సంబంధించిన అఫిషీయల్ అప్డేట్లను అతడి టీమ్ మాత్రమే వెల్లడిస్తుంది. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోండి అంటూ టీమ్ వెల్లడించింది.
We kindly request media outlets & individuals to refrain from spreading unverified information. pic.twitter.com/iIY0vOrGCS
— Sarath Chandra Naidu (@imsarathchandra) December 12, 2024