Allu Arjun | ప్రతిష్టాత్మక బెర్లిన్ 74వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం అల్ల్లు అర్జున్‌ని వరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెర్లిన్‌లో జరుగుతున్న చిత్రోత్సవాల్లో బన్నీ పాల్గొంటున్నారు. ఇదిలావుంటే.. ఈ చిత్రోత్సవాల్లో ‘పుష్ప ది రైజ్’ చిత్రాన్ని కూడా ప్రదర్శించనుండటం విశేషం. ఈ సందర్భంగా బన్నీ ‘పుష్ప’ ఫ్రాంచైజ్‌పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘విదేశాలలోని ప్రేక్షకుల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు మాపై ఉంది. ఈ చిత్రోత్సవాల్లో ‘పుష్ప’ను ప్రదర్శించనున్నారన్న విషయం తెలిసినప్పట్నుంచీ నాలో తెలియని ఉత్సాహం. ‘పుష్ప’ను ఎలా ఆదరిస్తారో చూడాలనుకుంటున్నా.
‘పుష్ప’ నా కెరీర్‌కే ప్రత్యేకం. పార్ట్-2 నే కాదు. ‘పార్ట్-3’ కూడా చేయాలనుకుంటున్నాం. అన్నీ అనుకూలిస్తే చేసే అవకాశం కూడా లేకపోలేదు. కొనసాగించడానికి తగిన స్టఫ్ ఈ కథలో ఉంది. ఆలోచనలు కూడా ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే మలిభాగంలో పాత్రల మధ్య సంఘర్షణ బలంగా ఉంటుంది. ముఖ్యంగా పుష్పరాజ్, భన్వర్‌సింగ్ షెకావత్‌ల పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు థ్రిల్‌కి గురిచేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా ఇమేజ్‌ని కట్టబెట్టింది. అంతేకాక, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. ఇప్పుడు అదే సినిమా ప్రతిష్టాత్మక బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడటంతో అల్లు అర్జున్ ఖ్యాతి ప్రపంచానికి చాటినట్లయింది.