Allu Arjun | సంధ్య థియేటర్ (Sandya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్(Allu arjun Gets Bail)కు నాంపల్లి కోర్టు(Nampally Court) రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెయిల్ పూచీకత్తు సమర్పించడం కోసం నేడు నాంపల్లి కోర్టుకు వెళ్లాడు అల్లు అర్జున్.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పలు షరతులతో కూడిన బెయిల్‌ను శుక్రవారం ముంజూరు చేసింది. అయితే రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు శనివారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ పూచీకత్తు సమర్పించడం కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాడు అల్లు అర్జున్.
Also Read..