‘పుష్ప’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైన అగ్ర హీరో అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంతో ప్రత్యేకంగా భావించే జీక్యూ ‘మ్యాన్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు ఆయన్ని వరించింది. వినోద రంగంలో విశేషమైన పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తులకు జీక్యూ ఇండియా మ్యాగజైన్ ప్రతి ఏటా ‘లీడింగ్ మ్యాన్’ ‘లీడింగ్ వుమెన్’ అవార్డులను ప్రదానం చేస్తుంది. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డు అల్లు అర్జున్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ‘జీక్యూ’ మ్యాగజైన్ టీమ్ ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘జీక్యూ మ్యాగజైన్ కవర్‌పై నా ఫొటో రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నన్ను అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నా లిస్ట్‌లోని ఓ టార్గెట్‌ను చేరుకున్నా’ అని అన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నది.