హైదరాబాద్‌కి చెందిన తెలుగు యూట్యూబ్ ఛానల్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేశారు. తమ హీరో మీదా ఈ ఛానల్ కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తుందని అందుకే దాడి చేసినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న రెడ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్‌పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనలో కంప్యూటర్లు, ఆఫీస్ సామగ్రి ధ్వంసం అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ ఉద్దేశించి కావాలని నెగిటివ్ ప్రచారం చేయడమే కాకుండా.. అల్లు అర్జున్ ఆరోగ్యం బాగా లేదని ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టడం ఈ దాడికి కారణం అని తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఒక వీడియో థంబ్నెయిలో అయితే ‘చావు, బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్’ అనే విధంగా కనిపించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రెడ్ ఆఫీస్‌కి వచ్చి నిరసన చేశారు. ఇక దీనిపై స్పందించిన రెడ్ టీవీ యాజమాన్యం ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టినందుకు అల్లు అర్జున్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పింది. ఇంకొసారి ఇలాంటివి ఘటనలు జరుగకుండా మాటిస్తున్నాం అంటూ తెలిపింది.
రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆఫీసు మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
కంప్యూటర్లు, సామగ్రి ధ్వంసం
అల్లు అర్జున్ మీద ఉద్దేశపూర్వకంగా నీచమైన ఫోటోలతో వీడియోలు చేస్తూ ‘చావు, బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్’ అంటూ వీడియోలు పెట్టడం పై ఆగ్రహం pic.twitter.com/Nc4gtP35b6
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2024