Viral Video | బెంగళూరు : పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోలకు ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. అయితే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. ఓ గ్రౌండ్లో ఉన్న ఓ యువకుడిని కొంత మంది చుట్టుముట్టారు. జై అల్లు అర్జున్ అనాలంటూ అతనిపై పంచుల వర్షం కురిపించారు. రక్తం వచ్చే దాకా అతని ముఖం, తలపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. జై అల్లు అర్జున్ అనరా.. అప్పుడు వదులుతాం అంటూ దాడికి పాల్పడ్డారు. అయితే బాధిత యువకుడు ప్రభాస్ అభిమాని అని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు బెంగళూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు వివరాలు తెలుసుకుని, కేఆర్ పురం పోలీసు స్టేషన్, డీసీపీ వైట్ ఫీల్డ్ డివిజన్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
గత కొన్ని రోజులుగా ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానులమంటూ చెప్పుకునే కొందరు వ్యక్తుల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరి హీరోను మరొకరు విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా నెటిజన్లు పోలీసులకు షేర్ చేశారు.
Allu Arjun fans are as energetic as #AlluArjun 😯😮😦😧pic.twitter.com/LptTpAq12P
— 𝙰𝚊𝚖𝚒𝚛 ✨ (@AamirsABD) March 10, 2024