స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రోఫెషనల్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం పక్కా టైం కేటాయిస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీని తీసుకొని మాల్దీవులకి వెళ్లిన బన్నీ అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. ఇక దీపావళి పండగ రోజు ఫ్యామిలీతో సరదాగా గడిపాడు.
అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రాములో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ‘ఫామ్ హౌస్ లో మా దీపావళి పార్టీ. ఈ అలంకరణకు కారణం స్నేహనే. తనే వ్యక్తిగతంగా ఇలా చేయించింది. ఇది దీపావళి వైబ్స్’ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ అల్లు ఇంట దీపావళి వెలుగులు అదిరిపోయాయి అని కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.
నటనే కాదు, వ్యాపార రంగంలోనూ తమదైన ముద్రవేయాలని బన్నీ భావిస్తున్నాడు. ‘AAA’ సినిమాస్ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్న థియేటర్‌కు శనివారం బన్ని పూజా కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
https://www.instagram.com/p/CV-pVYwFbBM/?utm_source=ig_web_copy_link