Allu Arjun | శుక్రవారం సాయంత్రం 71వ జాతీయ అవార్డులు ప్రకటించగా, ఇందులో తెలుగు సినిమాలు కూతా సత్తా చాటాయి. వివిధ విభాగాల్లో పలు తెలుగు చిత్రాలు, కళాకారులు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘భగవంత్ కేసరి’ అవార్డు గెలుచుకుంది.ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ కేటగిరిలో ‘హనుమాన్’ చిత్రం ఎంపికైంది. ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతివేణి (గాంధీ తాత చేటు) ఎంపికయ్యింది. ఉత్తమ గీత రచయిత అవార్డు ‘బలగం’ సినిమాకు దక్కింది . ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు ‘బేబీ’ సినిమాకు గాను సాయి రాజేష్ కు గౌరవం దక్కింది. ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా పాట) ఎంపికయ్యారు.
ఈ అవార్డులు ప్రకటించగానే సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు విజేతలకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ 71వ జాతీయ అవార్డుల్లో విజయం సాధించిన వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తూ అవార్డులు గెలిచినవారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన బన్నీ, హిందీ చిత్ర పరిశ్రమలో అవార్డులు పొందినవారిని కూడా అభినందించారు. ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న షారుక్ ఖాన్ మరియు విక్రాంత్ మస్సే లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
33 ఏళ్ల కెరీర్లో మరో మైలు రాయి చేరిందని, ఇందుకు కారణమైన అట్లీకి కూడా బెస్ట్ విషెస్ అని బన్నీ పేర్కొన్నాడు. విక్రాంత్ మస్సే నటించిన ‘12th ఫెయిల్’ తనకు ఎంతో ఇష్టమైన సినిమా అని తెలిపారు. ఉత్తమ నటి అవార్డు అందుకున్న రాణీ ముఖర్జీ కి అభినందనలు చెప్పారు. ఈ మేరకు అల్లు అర్జున్ వరుసగా ట్వీట్లు చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ అవార్డులు, ఇండస్ట్రీలో అందరికీ గర్వకారణంగా మారాయి. కాగా, బన్నీ కూడా పుష్ప చిత్రానికి గాను నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.