Allu Arjun | ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న నాలుగో చిత్రమిది కావడం విశేషం. ఇదిలావుండగా అల్లు అర్జున్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
దీనికి ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇటీవల ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథాంశం బాగా నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు అంగీకరించారని అంటున్నారు. త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఆఖరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.