Allu Arjun At India Day parade in New York | అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన 40వ ఇండియా డే పరేడ్‌లో అల్లుఅర్జున్ పాల్గొన్నాడు. న్యూయార్క్ నగరంలోని భారతీయులు ఆదివారం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భార్య స్నేహా రెడ్డితో కలిసి బన్నీ ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరేడ్‌లో అల్లుఅర్జున్ భారతదేశ గొప్పతన్నాన్ని వివరించాడు. అంతేకాకుండా చేతిలో భారత జెండాను పట్టుకుని ‘యే భారత్ కా తిరంగా హై.. కబీ ఝకేగా నహీ’ అంటూ పుష్ప డైలాగ్‌ను చెప్పాడు. అనంతరం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను ప్రత్యేకంగా కలిశాడు. ఆడమ్స్, అల్లుఅర్జున్‌కు ‘సర్టిఫికేట్ ఆప్ రికగ్నిషన్’ బహుకరించాడు.
అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప-2 కోసం సిద్దమవుతున్నాడు. గతేడాది విడుదలైన ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిదో అందిరికి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత బాలీవుడ్లో ఆ స్థాయిలో పుష్ప విజయం సాధించింది. ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా హిందీ బెల్ట్‌లో 100కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి బాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. సినీ సెలబ్రెటీల నుండి రాజకీయ నాయకులు, క్రికెటర్స్ వరకు ఈ సినిమాలోని డైలాగ్స్, డాన్స్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా సోమవారం పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
It was a pleasure meeting the Mayor of New York City . Very Sportive Gentleman. Thank You for the Honours Mr. Eric Adams . Thaggede Le ! @ericadamsfornyc @NYCMayorsOffice pic.twitter.com/LdMsGy4IE0
— Allu Arjun (@alluarjun) August 22, 2022