Allu Arjun at Chikkadapalli Police Station |టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు పలు షరతులను విధించిన విషయం తెలిసిందే. రూ.50 వేల రెండు పూచీకత్తులతో పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది. అయితే శనివారం నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలను సమర్పించిన అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి సంతకం పెట్టడానికి వచ్చారు. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌కి వచ్చి సంతకం చేయనున్నారు.