అగ్ర కథానాయిక శ్రీలీల శనివారం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకుంది. తన తల్లితో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించింది. గంగా హారతిలో కూడా పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘పుష్ప-2’ చిత్రంలో శ్రీలీల ‘కిస్సిక్..’ అనే ప్రత్యేక గీతంలో నర్తించిన విషయం తెలిసిందే. ఈ పాటలో అల్లు అర్జున్తో పాటు శ్రీలీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఈ పాటను నేడు చెన్నైలో జరిగే ఈవెంట్లో విడుదల చేయబోతున్నారు. ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మామ..’ అనే పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్లోని ‘కిస్సిక్..’ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన శ్రీలీల ఈ ప్రత్యేకగీతంలో నర్తించడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ‘పుష్ప-2’లో భాగం కావడం తన కెరీర్లో మెమొరబుల్ మూమెంట్గా భావిస్తున్నది శ్రీలీల. ఈ నేపథ్యంలో ఆమె చేపట్టిన వారణాసి ఆధ్యాత్మిక యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘పుష్ప-2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.