Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ (AA22) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ తెగ హల్చల్ చేస్తోంది. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, రష్మిక మందన్న హిట్ కాంబో ఈ సినిమాతో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్ మరింత విభిన్నంగా ఉండబోతోందని సమాచారం.
ఇప్పటివరకు బన్నీతో కేవలం రొమాన్స్ చేసిన రష్మిక, ఈ సినిమాలో సరికొత్తగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు అట్లీ ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో జరుగుతున్న భారీ యాక్షన్ షెడ్యూల్లో రష్మిక కూడా జాయిన్ అయినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘పుష్ప’ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్‌కి రష్మిక ఒక ‘లక్కీ చార్మ్’ అని, అందుకే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన నాయికగా నటిస్తుండగా, రష్మికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో రోల్లో మెరవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రేజీ తారాగణంతో అంచనాలను పెంచేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై చిత్ర యూనిట్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.