అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ఫిక్షన్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇప్పటికే నలభైశాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ‘ఏఏ 22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. పునర్జన్మలతో ముడిపడిన కథాంశమిదని, ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. ఈ పాన్ వరల్డ్ కథాంశానికి ఉన్న గ్రాండ్ స్కేల్, స్పాన్ దృష్ట్యా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ దిశగా దర్శకుడు అట్లీ నిర్ణయం తీసుకున్నారని, స్క్రిప్ట్‌పరంగా కూడా మార్పులు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది దసరా బరిలో తొలి భాగాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌లో టైటిల్ ప్రకటన ఉంటుందని సమాచారం. దాదాపు 800కోట్ల బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది.