అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సైన్స్‌ఫిక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఏఏ 22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పునర్జన్మలతో ముడిపడిన సైన్స్‌ఫిక్షన్ కథాంశమిదని, ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని సమాచారం. దీపికాపడుకోన్, మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో ఇద్దరు నాయికలకు చోటుందని తెలిసింది.
ప్రస్తుతం ఈ చిత్రం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్నది. తాజా అప్డేట్ ప్రకారం వచ్చే ఏడాది మే నెలలోగా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిసింది. 2026 దసరా బరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. జపనీస్-బ్రిటీష్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి ఈ సినిమాలో భాగమవుతున్నారు. దాదాపు 800కోట్ల బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది.