Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అల్లు అర్హ కూడా అంతే ఫేమస్. ఇక నెట్టింట తండ్రీ కూతురు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య అల్లు స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. అవి చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతుంటారు. వీడియోల్లో అర్హ తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటుంది. అయితే తాజాగా అల్లు అర్హకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈ వీడియోలో మంచు లక్ష్మి అల్లు అర్జున్ ఇంటికి రాగా.. నువ్వు ఎదో నన్ను అడగాలి అనుకుంటున్నావు అంటా ఏం అడుగుతావు చెప్పు అంటూ లక్ష్మి అర్హను అడిగింది. దీంతో లక్ష్మిని చూసిన అర్హ నువ్వు తెలుగేనా నువ్వు తెలుగు అమ్మాయివా అంటూ అడుగుతుంది. ఈ మాటకు షాక్ అయిన లక్ష్మి నేను తెలుగునే పాప.. అంత డౌట్ ఎందుకు వచ్చింది నీకు. నేను నీతో తెలుగులోనే కదా మాట్లాడుతుంది. ఎందుకలా అడిగావు అంటూ అర్హని అడుగుతుంది లక్ష్మి. దీనికి అర్హ సమాధానమిస్తూ.. నీ తెలుగు యాక్సెంట్(యాస) అలా ఉంది అనగా.. నీది కూడా అలానే ఉంది కదా అంటూ అర్హకి సమాధానమిచ్చింది లక్ష్మి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Arha🤣🤣🤣 pic.twitter.com/QRIy1Kaj06
— ᴊᴀᴍɪ🐉🪓 (@nameisSEKHARj) August 7, 2025