Atajani Kaanche – Allu Arha |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో .. ఆయన గారాల పట్టి అల్లు అర్హకూడా అంతే ఫేమస్. ఇక నెట్టింట తండ్రీ కూతురు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను బన్నీ భార్య అల్లు స్నేహ రెడ్డి తరచూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. అవి చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతుంటారు. వీడియోల్లో అర్హ తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటుంది. అయితే ఆర్హ తాజాగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4 హాజరయ్యింది.
తన తండ్రితో పాటు షోకి వచ్చిన అర్హ బాలయ్యతో సరదాగ ముచ్చటించింది. ఇక బాలయ్య కూడా అర్హతో సందడిగా గడపడమే కాకుండా.. దగ్గరికి తీసుకుని ముద్దాడాడు. అయితే ఈ షోలో బాలయ్య అర్హను అడుగుతూ.. తెలుగు వచ్చా అమ్మ అని అడుగుతాడు.
దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. తెలుగు రావటమా.. అంటూ తన కూతురు చెవిలో పద్యం పాడు అంటాడు. దీంతో అర్హ అల్లసాని పెద్దన్న రచించిన మను చరిత్రలోని ”అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన. స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్. గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్.” అంటూ ఫుల్ పద్యం చదివేస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్ తింటాడు బాలయ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Arha papa telugu😍🥺❤ @alluarjun pic.twitter.com/mjmMRaWNv7
— AK. (@flawsomedamsel) November 19, 2024