అల్లరి నరేశ్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న చిత్రం శనివారం పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మెహర్తేజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు చెప్పారు. రుహాని శర్మ ఇందులో కథానాయిక. మిగతా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్ని, సంగీతం: జిబ్రాన్, సహనిర్మాత: వెంకట్ ఉప్పుటూరి.