అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో ఆయన ఆల్కహాల్లో మునిగిపోయినట్లుగా కనిపిస్తున్నారు. భ్రమ, వాస్తవిక ప్రపంచాలకు ప్రతీకలా ఆ పోస్టర్‌ను డిజైన్ చేసినట్లుగా అనిపిస్తున్నది. ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మోహర్తేజ్ దర్శకత్వం వహించనున్నారు.
సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. రుహాణిశర్మ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, సంగీతం: గిబ్రాన్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: మెహర్తేజ్.