Allari Naresh | లుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు అల్లరి నరేష్ . కామెడీ హీరోగా కెరీర్ ప్రారంభించినా, భావోద్వేగం, యాక్షన్, ఇంటెన్స్ రోల్స్ వరకు అన్ని జానర్స్‌లోనూ నటించి తన బహుముఖ నటనా ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన చిత్రాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ, ఇప్పుడు కొత్త జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ నటించిన ‘12A రైల్వే కాలనీ’ ఈ నెల నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా అల్లరి నరేష్ మూవీ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు.
అయితే రీసెంట్గా తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అల్లరి నరేష్ తన కెరీర్లో భారీ హిట్‌గా నిలిచిన ‘సుడిగాడు’ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ఆసక్తికర విషయాలు చెప్పారు. సుడిగాడు నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా. సీక్వెల్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అప్పట్లో ఒక టికెట్‌పై 100 సినిమాల స్పూఫ్‌లు చేశాం… అవి బాగా వర్క్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా చేస్తే ఆడియన్స్ అంగీకరించరు. సోషల్ మీడియాలో, రీల్స్‌లో ఇప్పటికే చాలా మంది అదే చేస్తున్నారు. కాబట్టి, ఈసారి 1 టికెట్‌పై 200 సినిమాలు అనే లెవల్ లో ఉండాలి. ఆ దిశగా ‘సుడిగాడు 2’ను ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా వస్తుంది” అని చెప్పారు.
నరేష్ వ్యాఖ్యలతో సుడిగాడు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియడంతో, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ చివరి దశల్లో ఉండటంతో, సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లి, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాల్సి ఉంది.మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ స్థాయి విజయం సాధించింది అనేది రెండు రోజులలో తెలుస్తుంది.