Bacchala Malli Teaser | అల్లరి నరేశ్ (Allari Naresh) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం బచ్చలమల్లి (Bacchala Malli). సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్.
కావేరి నీతో మాట్లాడాలి.. నాకు సిగరెట్ అలవాటుంది.. మందు అలవాటుంది.. అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది.. అల్లరి నరేశ్ హీరోయిన్‌కు చెప్పే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. మీ నాన్నేదో నిన్ను గొప్పోడిని చేయాలనుకుంటే నువ్వేంట్రా ఇలా యెధవలా తయారయ్యావంటున్నాడు రావు రమేశ్. నేను ఎవ్వరి కోసం మారను. నాకు నచ్చినట్టు బతుకుతా అంటూ సాగుతున్న సీన్లు బచ్చలమల్లి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెబుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే అల్లరి నరేశ్ సిగరెట్ తాగుతూ సీరియస్ మూడ్‌లో ఉన్న పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుప్తా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బచ్చలమల్లి టీజర్..
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్