Alcohol Teaser | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమాకు మెహర్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్, శ్రీకర స్టూడీయోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. మందు తాగాని వ్యక్తితో బలవంతంగా మందు తాగిపిస్తే.. ఆ తర్వాత జరిగిన పరిణామలు ఏంటి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. కామెడియన్ సత్యతో పాటు రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.