Allari Naresh | నటుడు అల్లరి నరేష్ (Allari Naresh) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’(Bachhala Malli). ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi) దర్శకత్వం వహిస్తుండగా.. హాస్యా మూవీస్(Hasya Movies) పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్‌కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. ఈ మూవీని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్(Bachhala Malli Trailer)ను విడుదల చేశారు మేకర్స్.
1990 నేపథ్యంలో సాగే ఈ కథలో నరేష్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని మేకర్స్ తెలిపారు. నాంది తర్వాత మళ్లీ అలాంటి పవర్ఫుల్ రోల్లో నరేష్ కనిపించనుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.