Adipurush | సహనాన్ని కూడా పరీక్షిస్తారా?.. ఆదిపురుష్ మేకర్స్పై అలహాబాద్ హైకోర్టు చురకలు
Adipurush | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఆదిపురుష్ (Adipurush). అయితే ఆదిపురుష్ సినిమాపై నిషేధం విధించాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
Adipurush | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఆదిపురుష్ (Adipurush) . ఓం రౌత్ డైరెక్షన్లో మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పురాణేతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆదిపురుష్లో చూపించిన పాత్రలు ఒరిజినల్ రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని, సినిమాపై నిషేధం విధించాలని అలహాబాద్ హైకోర్టు లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
ఆదిపురుష్ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని వస్తున్న ఆరోపణలపై, ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసిన డైలాగ్లపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సినిమా నిర్మాతలను ప్రశ్నించింది. ఈ కేసులో సహ-రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్లాను భాగస్వామిగా చేయాలని ఆదేశించిన కోర్టు.. ఈ మేరకు మనోజ్ ముంతాషీర్కు నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
సెన్సార్ బోర్డ్ తన బాధ్యతను నెరవేర్చిందా..?
రామాయణం మనకు ఆదర్శం. ప్రజలు ఇంటి నుండి బయలుదేరే ముందు రామచరితమానస్ని చదువుతారు. సినిమాలోని సంభాషణల తీరు పెద్ద సమస్య. సినిమాలు కొన్ని విషయాలను టచ్ చేయకూడదని కోర్టు పేర్కొంది. హిందూ మతానికి చెందిన ప్రజలు చాలా సహనంతో ఉంటారు.. దీనిని కూడా పరీక్షిస్తారా? అంటూ ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.సెన్సార్ బోర్డ్ అని పిలవబడే ఫిల్మ్ సర్టిఫికేషన్ అథారిటీ తన బాధ్యతను నెరవేర్చిందా.. అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
సినిమా చూసి ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండటం విశేషం. ఏమీ కాదన్నట్లుగా సినిమాలో హనుమంతుడిని, సీతను చూపించారు. ఈ అంశాలను మొదటినుంచీ తొలగించాల్సింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు (అడల్ట్)గా అనిపించాయి. ఇలాంటి సినిమాలను చూడటం చాలా కష్టం. ఇది చాలా తీవ్రంగా పరిగణించే విషయం. సెన్సార్ బోర్డు దీనిపై ఏమి చేసిందని కోర్టు ప్రశ్నించింది.
సినిమాలో అభ్యంతరకరమైన డైలాగులను తొలగించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వివరణపై కోర్టు స్పందిస్తూ.. అదొక్కటే పనికిరాదని.. సీన్లు ఏం చేస్తారనేదానిపై సూచనలు తీసుకోండి. అప్పుడు తాము చేయాలనుకున్నది తప్పకుండా చేస్తాం.. ఒకవేళ సినిమా స్క్రీనింగ్ నిలిచిపోతే.. ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఉపశమనం లభిస్తుంది.. అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రేపు తదుపరి విచారణ కొనసాగనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

