లండన్: ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్(All Quiet On The Western Front) .. ఈ యేటి బాఫ్టా(Baftas) అవార్డుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఆ ఫిల్మ్‌కు ఏడు అవార్డులు దక్కాయి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్(నాన్ ఇంగ్లీష్),బెస్ట్ డైరెక్టర్ అవార్డులను ఆ ఫిల్మ్ ఎగురేసుకుపోయింది. ఎడ్వర్డ్ బెర్గర్కు బెస్ట్ డైరక్టర్ అవార్డు లభించింది. ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ ఇంగ్లీష్ క్యాటగిరీ సినిమా కాకున్నా.. బాఫ్టా వేడుకల్లో ఏడు అవార్డులు గెలిచిన తొలి నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్‌గా నిలిచింది. తొలి ప్రపంచ యుద్ధం కథా నేపథ్యంతో ఈ ఫిల్మ్ సాగుతుంది. ద బాన్షీస్ ఆఫ్ నిషీరన్, ఎల్విస్(Elvis) చిత్రాలకు నాలుగేసి బాఫ్టాలు వచ్చాయి.
1928లో ఎన్రిచ్ మారియా రిమార్క్యూ రాసిన నవల ఆధారంగా ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రాన్ని తీశారు. ఎల్విస్ చిత్రంలో నటించిన ఆస్టిన్ బట్లర్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది.
బాఫ్టా అవార్డుల్లో ఆర్ఆర్ఆర్కు మొండిచెయ్యి మిగిలింది. నాటు నాటు సాంగ్‌కు పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చినా.. బాఫ్టాలో మాత్రం రిక్తహస్తాలు తప్పలేదు. ఒరిజినల్ స్కోర్ క్యాటగిరీలో ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకే అవార్డు దక్కింది.