రావణ్ నిట్టూరు, శ్రీ నికిత జంటగా నటిస్తున్న సినిమా ‘అలిపిరికి అల్లంత దూరంలో’. ఈ చిత్రాన్ని కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్నారు. ఆనంద్ జె దర్శకుడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ‘మా తిరుపతి..’ పాటకు మంచి స్పందన వస్తున్నదని సినిమా టీమ్ చెబుతున్నారు. తిరుపతి వైభవాన్ని తెలిపేలా చిత్రీకరించిన ఈ పాటకు ఫణి కళ్యాణ్ స్వరకల్పన చేయగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. శంకర్ మహదేవన్, రమ్య బెహర పాడారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి తదితరులు నటిస్తున్నారు.