Aliabhat | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ టాలీవుడ్లో వరుసగా సినిమాలను చేస్తుంది. ఇప్పటికే ఈమె నటించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్దంగా ఉంది. దీనితో పాటుగా కొరటాలశివ-ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా కన్ఫార్మ్ అయింది. తాజాగా ఎన్టీఆర్-రామ్‌చరణ్ జరిపిన ఫన్నీ చిట్ చాట్‌తో ఆలియా ఆడియెన్స్‌కు బాగా దగ్గరైయింది. ఇప్పటికే అల్లుఅర్జున్‌తో కలిసి నటిస్తాను అని స్టేట్మెంట్ వైరల్‌గా మారగా ఈమె దగ్గరకు మరో ఆసక్తికర ప్రశ్న వెళ్లింది. టాలీవుడ్ హీరోయిన్లలో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించగా..సమంత అంటే ఇష్టమని తెలిపింది. సమంతతో కలిసి నటించాలనుంది అని చెప్పింది.
ఫ్యామిలీమ్యాన్ -2లో సమంత నటన చూసి ఆశ్చర్యపోయాను. ఛాన్స్ వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్ సినిమా చేయలనుకుంటున్నా అని వెల్లడించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలియాభట్ ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడిగా సీత పాత్రలో నటించింది. ఈమె నటించిన గంగూబాయి కతియావాడి చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచుతుంది.