అగ్ర కథానాయిక అలియాభట్ కేన్స్ చిత్రోత్సవంలో సందడి చేసింది. ఎర్రతివాచీపై నాజూకు అందాలతో హొయలొలికించింది. ఈ భామ వరుసగా రెండోసారి కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో భాగమైంది. రెడ్ కార్పెట్ ఎంట్రీకి ముందే తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది అలియా. సాధారణ ఎంబ్రాయిడరీతో కూడిన పూల గౌను ధరించి వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
అక్కడక్కడా సన్నటి వజ్రాలు పొదిగిన ఈ గౌనులో అలియా దేవకన్యలా ఉందని ఆమె అభిమానులు సోషల్‌మీడియాలో ప్రశంసిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలను షేర్ చేసిన అలియా ‘హలో కేన్స్’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఏడాది కేన్స్‌లో భారతీయ సినీరంగం నుంచి ఐశ్వర్యరాయ్, జాన్వీకపూర్, అలియాభట్, అతిధి రావు హైదరీ వంటి బాలీవుడ్ తారలు తళుక్కున మెరిశారు. కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ శనివారంతో ముగియనుంది. ప్రస్తుతం అలియాభట్ ‘లవ్ అండ్ వార్’ ‘అల్ఫా’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.