Alia Bhatt | అర్థం చేసుకునే భర్త అందరికీ దొరకడు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా బలహీనతల్ని కూడా ప్రేమించే వ్యక్తి నాకు భర్తగా రావడం అదృష్టం కాక మరేంటి? అని అంటున్నది బాలీవుడ్ సూపర్హీరోయిన్ అలియాభట్. రీసెంట్గా తనకున్న మానసిక రుగ్మత గురించి ఆమె ఓ కార్యక్రమంలో బయట పెట్టారు. ‘నాకు చిన్నప్పట్నుంచీ హైపర్ టెన్షన్ సమస్య ఉన్నది.
అయినదానికీ కాని దానికీ టెన్షన్ పడిపోవడం నా బలహీనత. ఒక్కోసారి ఈ విషయంలో నియంత్రణ కోల్పోతుంటా. ఈ విషయం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు రణబీర్. రెండేళ్ల క్రితం క్రిస్మస్ టైమ్‌లో ఇద్దరం లంచ్‌కి బయటకు వెళ్లాం. అప్పుడు అనుకోకుండా ఈ సమస్య తలెత్తింది.
అలాగే మా కుమార్తెకు ‘రాహా’ అని పేరు పెట్టిన తర్వాత మీడియాకు పరిచయం చేద్దామని ఫస్ట్‌లో అనుకున్నాం. కానీ.. నా హైపర్ టెన్షన్ వల్లే అది కుదర్లేదు. నిజానికి ఇది కనిపించనంత పెద్ద సమస్య. దాన్ని భరించే వాళ్లకు ఓర్పు అవసరం. నేను ఇలా హైవర్ టెన్షన్‌కి గురైన ప్రతిసారీ.. రణబీర్ తెలివిగా టాపిక్ మార్చేసి ఏవేవో మాట్లాడుతూ, నన్ను మామూలు మనిషిని చేస్తాడు.’ అంటూ చెప్పుకొచ్చింది అలియా.