బాలీవుడ్ (Bollywood)లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి బ్రహ్మాస్త్ర (Brahmastra). టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్లు రణ్ బీర్ కపూర్ (Ranbir kapoor), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అలియాభట్, మౌనీరాయ్, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కీ రోల్స్ లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్‌ను మేకర్స్ అందించారు. అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. అలియాభట్ పోషిస్తున్న ఇషా పాత్ర అఫీషియల్ లుక్ వీడియోను లాంఛ్ చేశారు. అలియాభట్ గ్లామరస్ అవతార్‌లో, సీరియస్ లుక్‌తోపాటు యాక్షన్ సన్నివేశాల్లో అదిరిపోయే యాక్టింగ్ చేసినట్టు తాజా వీడియోతో అర్థమవుతోంది. బ్రహ్మాస్త్ర ప్రాజెక్టును కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్ రోల్ శివత్రిపాఠి లుక్ విడుదలవగా మంచి స్పందన వస్తోంది.