మలయాళంలో బాక్సాఫీస్ హిట్గా నిలిచిన స్పోర్ట్స్ డ్రామా ‘అలప్పజ జింఖానా’. ఈ సినిమా ‘జింఖానా’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ఫేం నస్లెన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు.
మలయాళంలో రికార్డులు తిరగరాసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జిమ్షి ఖలీద్, సంగీతం: విష్ణు విజయ్.