‘ఈ సినిమాలో నేను సిద్ధు పాత్రలో కనిపిస్తాను. తను రామచంద్రుడులాంటి వాడు. చాలా ఇంట్రోవర్ట్. అతని ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆద్యంతం ఆసక్తిని పంచుతుంది’ అన్నారు కృష్ణవంశీ. ఆయన హీరోగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అలనాటి రామచంద్రుడు’ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు.
మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా ఇది. హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాలని కోరుతున్నా. ఈ కథ అనుకున్నప్పుడే కొత్తవారితో సినిమా చేయాలనుకున్నా. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు’ అన్నారు. దిల్‌రాజుగారికి ఈ సినిమా నచ్చి రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, చక్కటి ఎమోషన్స్‌తో సినిమా అందరిని మెప్పిస్తుందని నిర్మాత శ్రీరామ్ జడపోలు తెలిపారు. ఇదొక క్లాసిక్ లవ్‌స్టోరీగా నిలిచిపోతుందని కథానాయిక మోక్ష పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.