అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో బ్లాక్ బాస్టర్‌గా హిట్‌గా నిలిచింది. బన్నీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా.. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
షెహ్జాదా (Shehzada) టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా మేకర్స్ షెహ్జాదా టీజర్ (Shehzada Teaser)ను విడుదల చేశారు. కార్తీక్ ఆర్యన్ హిందీ వెర్షన్లో అల్లు అర్జున్ యాక్టింగ్‌కు ఏ మాత్రం తగ్గకుండా పోటీపడి మరి నటించాడని టీజర్‌తో అర్థమవుతుంది.
రోహిత్ ధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పరేశ్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడ్కర్, రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కృతిసనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ & టీ సిరీస్, అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్ ఫిలిమ్స్, అల్లు ఎంటర్టైన్మెంట్, బ్రాట్ ఫిలిమ్స్, హారికాఅండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
షెహ్జాదా టీజర్.. వీడియో
Read Also : Shloka Entertainments | వాల్తేరు వీరయ్య సహా ఐదు భారీ చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న బ్యానర్
Read Also :HIT 2 | హిట్ 2 ట్రైలర్ టైం చెబుతూ.. అడివి శేష్ టీం కొత్త పోస్టర్
Read Also : Jr NTR | మాస్ హీరో క్లాస్ లుక్ అదిరింది.. ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్