Akshay Kumar | బాలీవుడ్ క్యూట్ కపుల్ అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ట్వింకిల్ ఖన్నా తన 52వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన భార్యకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
అక్షయ్ సోషల్ మీడియాలో ఒక ఫన్నీ ఫోటోను షేర్ చేస్తూ.. ట్వింకిల్ తనను సరదాగా తన్నుతుంటే, తాను నవ్వుతూ ఆమె కాలు పట్టుకున్న దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోకి క్యాప్షన్ ఇస్తూ.. “లోకానికి నేను యాక్షన్ హీరోని కావచ్చు.. కానీ ప్రతి యాక్షన్ హీరో వెనుక, అతన్ని ఒక్క చూపుతోనో లేదా ఒక్క తన్నుతోనో కంట్రోల్ చేయగలిగే భార్య ఉంటుంది. మిసెస్ ఫన్నీబోన్స్ (ట్వింకిల్), నా సినిమాల్లోని స్టంట్స్ కంటే నీ దెబ్బలే చాలా పవర్ఫుల్. హ్యాపీ బర్త్ డే మై లవ్! అంటూ అక్షయ్ రాసుకోచ్చాడు.
ట్వింకిల్ ఖన్నా కేవలం అక్షయ్ కుమార్ భార్యగానే కాకుండా, నటిగా, రచయిత్రీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ట్వింకిల్ సుపరిచితురాలే. ఆమె విక్టరీ వెంకటేష్ సరసన ‘శీను’ సినిమాలో నటించి మెప్పించింది. 2001లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఆరవ్, నితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Behind every action hero is a wife who can knock him out with one look, or one kick 😉
Mrs Funnybones, you still hit me harder than any stunt ever did.
Happy Birthday, love you ♥️🎂 pic.twitter.com/W16nuxbqqB— Akshay Kumar (@akshaykumar) December 29, 2025