Akshay Kumr | ‘శంభు’ అనే ఓ భక్తిరస సంగీత వీడియో సాంగ్ ఈ నెల 5వ తేదీ సోమవారం (నేడు) విడుదల కానున్నది. ఈ వీడియోలో హిందీ అగ్ర నటుడు అక్షయ్‌కుమార్ శివభక్తుడిగా నటించారు. భగవంతుడి పట్ల నిజమైన భక్తిని చాటుతూ శివుడి సేవకు అంకితమైన భక్తుడు రూపాంతరం చెందడాన్ని ప్రదర్శిస్తున్న ఓ పోస్టర్‌ను అక్షయ్‌కుమార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే అదే పాటను అక్షయ్‌కుమార్ గానం చేశారని తాజా సమాచారం.
సుధీర్ యదువంశీ, విక్రమ్ మంట్రోస్లతో కలిసి అక్షయ్‌కుమార్ శంభు ట్రాక్‌కి తన విలక్షణమైన టచ్‌ని జోడించి పాటను మరింత ఎత్తుకు తీసుకెళ్లారని మేకర్స్ చెప్తున్నారు. మహాశివరాత్రి వేడుక సందర్భాన్ని పురస్కరించుకొని శివుడికి అంకితం చేసిన గీతమే ఈ ‘శంభు’. లోతైన భక్తిభావాన్ని ప్రేరేపితం చేస్తూ సంగీత ప్రియులను అలరిస్తుందని అంటున్నారు. అక్షయ్‌కుమార్ శివభక్తుడిగా కనిపిస్తుండటం ఇది రెండోసారి. గతంలో ‘ఓ మైగాడ్-2’ చిత్రంలో ఆయన శివభక్తుడిగా నటించారు.