Manipuri Violence | మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కుకీ తెగను చెందిన మహిళలను మైతేయి తెగకు చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటనపై స్పందిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Akshay Kumar | అక్షయ్‌కుమార్..
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యానికి సంబంధించిన వీడియో చూసి అవాక్కయ్యా. ఇంకెప్పుడూ ఇలాంటి భయంకరమైన పని చేయాలనే ఆలోచన రానీయకుండా ఉండేలా.. దోషులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నానని అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశాడు.
Shaken, disgusted to see the video of violence against women in Manipur. I hope the culprits get such a harsh punishment that no one ever thinks of doing a horrifying thing like this again.
— Akshay Kumar (@akshaykumar) July 20, 2023
మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో కలవరపెడుతోంది.. ఇది మానవజాతికే అవమానం. ఇంకెవరూ అలా ఆలోచించే ధైర్యం చేయకుండా దోషులకు కఠిన శిక్ష పడాలని ఆశిస్తూ.. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా..అని ట్వీట్ చేసింది రకుల్.
The manipur video of violence against two women is extremely disturbing.. it’s a disgrace to humanity.. I hope and pray the culprits get severe punishment so it sets example for no one else to even dare to think to do so . 💔
— Rakul Singh (@Rakulpreet) July 20, 2023
Vivek Ranjan Agnihotri | డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి..
మోప్లా, డైరెక్ట్ యాక్షన్ డే, నోఖాలి, బంగ్లాదేశ్, పంజాబ్, కాశ్మీర్, బెంగాల్, కేరళ, అస్సాం, బస్తర్, ఇప్పుడు మణిపూర్.. ప్రతీసారీ మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానవీయ, అనాగరిక చర్యలకు అంతిమ బాధితులుగా మారుతున్నారు. ఓ భారతీయ పౌరుడిగా ప్రతీసారీ నా హృదయం బద్దలైపోతుంది. నేను సిగ్గుపడుతున్నా. నా నిస్సహాయతకు అపరాధభావంతో కృంగిపోతున్నా. ఓ మణిపూర్.. నేను ప్రయత్నించాను..ప్రయత్నించాను.. కానీ విఫలమయ్యాను. నేనిప్పుడు చేయగలిగేది నా సినిమాల ద్వారా వారి విషాద కథలను చెప్పడం. కానీ చాలా ఆలస్యం అయింది.
పోటీతత్వ ఎన్నికల రాజకీయాలకు మనమంతా బాధితులమే. మేము ప్రమాదకరమైన మీడియా బాధితులం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
MANIPUR:
Moplah, Direct Action Day, Noakhali, Bangladesh, Punjab, Kashmir, Bengal, Kerala, Assam, Bastar and now Manipur…
Every time our innocent mothers and sisters become the ultimate victims of inhuman, barbarian acts.
As a Bharatiya, as a man, as a human being, I am…
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 20, 2023