బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను స్టార్ హీరోనే. ఆయన ఎన్నో సార్లు ఉదారతను చాటుకున్నారు. ఆపద వచ్చినప్పుడల్లా తన వంతు సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలిచారు. గత ఏడాది కరోనా విజృంభిస్తున్న సమయంలో భారీ విరాళాలు అందించిన అక్షయ్ కుమార్ తాజాగా కరోనా వైరస్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. కోటి విరాళంగా ఇచ్చారు.
తన స్వచ్చంధ సంస్థకు అక్షయ్ కోటి రూపాయలు విరాళం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్ అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అక్షయ్ ఇచ్చింది డబ్బులు మాత్రమే కాదు, ఎందరో జీవితాలకు భరోసాను కల్పించారు. అక్షయ్ ఇచ్చిన డబ్బును మా ఫౌండేషన్ ద్వారా ఆక్సీజన్, ఫుడ్ ,మెడిసిన్ వంటి వాటిని అవరసరమైన వారికి వినియోగిస్తాం అని అన్నారు అక్షయ్. అయితే గంభీర్ ట్వీట్‌పై కూడా అక్షయ్ స్పందించారు. కఠినమైన ఈ సమయంలో నా వంతు సాయం చేయడం సంతోషంగా అనిపిస్తుంది. ఈ సంక్షోభం నుండి త్వరలోనే బయటపడతాం అని ఆశిస్తున్నాను అని అక్షయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ కూడా కరోనా వైరస్ బారినపడగా, ఆయనకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం అక్షయ్ ఖాతాలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
These are really tough times, @GautamGambhir. Glad I could help. Wish we all get out of this crisis soon. Stay Safe 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) April 24, 2021
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
IPL 2021: ధోనీ vs కోహ్లి.. ఆసక్తి రేపుతున్న సూపర్ సండే ఫైట్