Akshay Kumar | బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఒకరు. 90స్లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్‌లో వీరిద్దరికి పరిచయం కాగా.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు అక్షయ్. అయితే అప్పటికే అక్షయ్ స్టార్ హీరోగా కెరీర్లో నిలదొక్కుకుంటుండగా.. రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది ట్వింకిల్ ఖన్నా. ఇక 1999లో అక్షయ్, ట్వింకిల్ కలిసి ఇంటర్నేషనల్ ఖిలాడీ అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా వలన ఇద్దరు దగ్గరయ్యారు. ఆ తర్వాత వచ్చిన మేలా చిత్రంతో ప్రేమలో పడిన ఈ జంట 2001లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 24 ఏండ్లుగా ఒకరినోకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది ఈ జంట. అయితే తన సినిమాల ఎంపికకు సంబంధించి ట్వింకిల్ తనను ఎగతాళి చేస్తుందని తెలిపాడు అక్షయ్ కుమార్.
అక్షయ్ గత కొన్ని ఏండ్లుగా దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. హాలిడే, బేబీ, ఎయిర్‌లిఫ్ట్, గోల్డ్, మిషన్ మంగళ్, రీసెంట్గా వచ్చిన స్కై ఫోర్స్ ఇలా దాదాపు అక్షయ్ తీసిన సినిమాలన్ని దేశభక్తి కథతోనే వచ్చాయి. అయితే తన సినిమాల ఎంపికపై నా భార్య నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తుంటుంది. ఇంకా ఎన్నిసార్లు దేశాన్ని కాపాడతావు అంటూ కామెంట్ చేస్తుంటుంది. కొత్తగా ట్రై చేయవచ్చు కదా అంటూ ఆటపట్టిస్తుంది అంటూ చెప్పుకోచ్చాడు అక్షయ్.
అలాగే తన సినిమాలపై అక్షయ్ మాట్లాడుతూ.. నా మనసుకు నచ్చేతేనే చేస్తానని.. హాలీవుడ్ సినిమాలలో అమెరికా ప్రంపంచాన్ని కాపాడినట్లు చూపించినట్లే భారత్ కూడా అలాంటి సామర్థ్యం చూపగలదని నమ్ముతానని అక్షయ్ తెలిపాడు.