Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) విజయ్ బిన్ని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం నా సామి రంగ (Naa Saami Ranga) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. నాగార్జునను ఇదివరకెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ అయినట్టు ఓ వార్త కూడా వచ్చింది. అయితే తాజాగా షూటింగ్ షెడ్యూల్స్కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేయాలని గట్టిగా ఫిక్సయిందట నాగ్ టీం. త్వరగా పూర్తి చేసి ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
గతంలో బంగార్రాజు సినిమాను కూడా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఇప్పుడిదే ఫార్ములాను అప్లై చేస్తుండటంతో సినిమా గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్‌తో నా సామి రంగ షూటింగ్ షురూ అయినట్టు టాక్.
హైదరాబాద్‌లో వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో నాగార్జున, ఫైటర్స్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తు్న్నాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా సామి రంగ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు.
జా.. జా.. జాతర.. ఇది గణపయ్య జాతర✨️❤️
Team #NaaSaamiRanga wishes all a #HappyVinayakaChavithi
WW Release on Sankranti 2024🤩@iamnagarjuna @ChoreographerVJ @mmkeeravaani @KumarBezwada @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/QP1bYIi9Ri
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023