Prime Minister Modi | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు అక్కినేని ఫ్యామిలీతో భేటీ అయ్యాడు. నేడు కుటుంబ సమేతంగా మోడీని కలిసేందుకు నాగార్జునతో పాటు అమల, కొత్త జంట నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పార్లమెంట్‌కి వెళ్లారు. ఈ మీటింగ్‌లో అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. మోడీతో భేటి అయిన ఫొటోలు బయటకు రాకపోగా.. అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్లో దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మన్ కీ బాత్‌లో భాగంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై మాట్లాడిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు ఆయన అందించిన కృషిని మోడీ మన్ కీ బాత్‌లో వెల్లడించాడు. ఇక మోడీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు.