Akkineni Family | టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్‌లో అక్కినేని కుటుంబం ఒకటి. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇక నాగేశ్వరరావు అనంతరం ఆయన వారసులుగా నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ హీరోలుగా వచ్చి వారికంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగానే కాకుండా అతిథి పాత్రల్లో మెరుస్తుండగా.. సుమంత్, సుశాంత్ చైతూ, అఖిల్ నటులుగా రాణిస్తున్నారు. అయితే తాజాగా అక్కినేని కజిన్స్ అంతా రీయూనియన్ అయ్యారు. సందర్భం ఏంటో తెలిదు కానీ ఇలా అక్కినేని వారసులు అంతా ఒకే చోటా కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోలో నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియతో పాటు మరికొంతమంది కజిన్స్ కనిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) అనే చిత్రంలో నటిస్తుండగా.. నాగ చైతన్య తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ విషయానికి వస్తే.. గతేడాది ఎజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
Picture perfect!! 👌😍
Looks like the Akkineni family cousins had a nice time connecting with each other! ❤️#NagaChaitanya #AkkineniAkhil #Sumanth #Sushanth #TeluguFilmNagar pic.twitter.com/AremFXrpUM— Telugu FilmNagar (@telugufilmnagar) May 12, 2024