Akkineni Akhil | అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ సినిమాల సంగతేమో కాని పెళ్లి వార్తలతో వార్తలలో వస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. వీలైనంత తొందరలనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్గా అఖిల్, జైనాబ్ ఇద్దరూ జంటగా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్ పోర్టులో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వీరిని ఇలా చూసిన నెటిజన్స్ పెళ్లి కళ వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జంట చాలా చూడముచ్చటగా ఉందని, పెళ్లి పనులలో వారు బిజీగా ఉన్నారేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు కాబోయే భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం టూర్ వేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు కావడంతో స్పెషల్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకే ఇద్దరు మంచి ప్లేస్‌కి వెళుతున్నారేమో అని, ఇదే అఖిల్ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే పార్టీ అవుతుందేమో అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో అఖిల్ ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. తనని పెళ్లి చేసుకుంటాడు అనుకునే లోపు వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక అఖిల్ చివరిసారిగా ఏజెంట్ చిత్రంతో ఆడియన్స్‌ని అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక అఖిల్ కొత్త ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పటి వరకు తెలియజేయలేదు. అయితే అఖిల్ బర్త్ డే సందర్భంగా ‘Akhil 6’ అప్ డేట్ రానుందని పోస్ట్ పెట్టారు నిర్మాత నాగవంశీ. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 8న అధికారిక ప్రకటన రాబోతోంది. అదే రోజున ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ్రామీణ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇందులో
శ్రీలీల కథానాయిక అని అంటున్నారు.